logo

ఎవరికి వారే..చెప్పినా ఆగరే!

కోసిగిలో ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదు. వందలాది వాహనాలు తిరుగుతున్న రహదారిలో రైల్వే గేట్‌ వద్ద ప్రయాణికులు నరకయాతన పడుతున్నా పట్టించుకోవడం లేదు.

Published : 28 Jan 2023 01:48 IST

కోసిగిలో ట్రాఫిక్‌ను నియంత్రించడం లేదు. వందలాది వాహనాలు తిరుగుతున్న రహదారిలో రైల్వే గేట్‌ వద్ద ప్రయాణికులు నరకయాతన పడుతున్నా పట్టించుకోవడం లేదు. కోసిగి నుంచి ఉరుకుంద, తదితర గ్రామాలకు వెళ్లే రహదారి మధ్య రైల్వే గేట్ ఉంది. రైలు వస్తుందని అరగంట నుంచి గంట వరకు నిలుపుతుండడంతో వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. పోలీసుల నియంత్రణ లేకపోవడంతో గేట్ తీసిన వెంటనే రెండు వైపుల నుంచి వాహనాలు ఒక్కేసారి కదలడంతో ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. వాహనాలు కదలక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉపరితల వంతెన నిర్మించాలని స్థానికులు పలుమార్లు విన్నవించినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు తెలిపారు.

న్యూస్‌టుడే, కోసిగి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని