logo

ప్రజా సమస్యలు చర్చించకుండానే ముగిసిన కౌన్సిల్‌ సమావేశం

ప్రజా సమస్యలపై చర్చించకుండానే ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్‌ సమావేశం శనివారం ముగిసింది. ఛైర్‌ పర్సన్‌ శాంత అధ్యక్షతన  నిర్వహించిన ఈ సమావేశంలో 23 అంశాలతో కూడిన ఎజెండాను ఆమోదించారు.

Updated : 28 Jan 2023 19:56 IST

ఆదోని మార్కెట్‌ : ప్రజా సమస్యలపై చర్చించకుండానే ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్‌ సమావేశం శనివారం ముగిసింది. ఛైర్‌ పర్సన్‌ శాంత అధ్యక్షతన  నిర్వహించిన ఈ సమావేశంలో 23 అంశాలతో కూడిన ఎజెండాను ఆమోదించారు. ఈ ఎజెండాలో పొందుపరిచిన సినిమా థియేటర్లకు ఆస్తిపన్ను విధింపుపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశానికి  కొందరు వార్డు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో  పురపాలక కమిషనర్‌ రఘునాథరెడ్డి, సహాయ కమిషనర్‌ అనుపమ,  మున్సిపల్‌ ఇంజినీర్‌ సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు