logo

సీమ అభివృద్ధికి సహకరించకుంటే పతనం తప్పదు

రాయలసీమకు చెందిన  ఎమ్మెల్యేలు..  ఎంపీలు  అభివృద్ధికి సహకరించకపోతే వారికి పతనం తప్పదని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.  

Published : 29 Jan 2023 04:25 IST

రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

మాట్లాడుతున్న రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పక్కన ఆదినారాయణరెడ్డి

కొత్తపల్లి, న్యూస్‌టుడే : రాయలసీమకు చెందిన  ఎమ్మెల్యేలు..  ఎంపీలు  అభివృద్ధికి సహకరించకపోతే వారికి పతనం తప్పదని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.  సంగమేశ్వరం వద్ద కష్ణానదిపై తీగల వంతెనకు బదులు సిద్ధేశ్వరం బ్యారేజి నిర్మించాలన్న డిమాండ్‌తో శనివారం రాయలసీమ ప్రజాప్రదర్శన యాత్ర నిర్వహించారు.  నంద్యాల, కర్నూలుతో పాటు ఇతర జిల్లాల నుంచి  రైతులు, నాయకులు తరలివచ్చారు. సంగమేశ్వరం వద్ద నిర్వహించిన సభలో రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిపై రెండు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే తీగల వంతెనతో రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదు.. పవన్‌కల్యాణ్‌ వంటి వారు షూటింగ్‌లు చేసుకునేందుకు  పనికొస్తుందని ఎద్దేవా చేశారు. దాని స్థానంలో బ్యారేజి నిర్మిస్తే 70 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు.    మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీసీ సంఘాల నాయకుడు రామచంద్రయాదవ్‌, ఆర్‌వీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని