logo

వాగులో ఇసుకాసురులు

వాగులోని ఇసుక అక్రమార్కుల వశమై తరలిపోతోంది. తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామ సమీపంలోని ఈదులవాగులో ఇసుకను రాత్రిపూట పక్కన ఉన్న మండలాల గ్రామాలకు తరలించి లక్షలు ఆర్జిస్తున్నారు.

Published : 29 Jan 2023 04:25 IST

ట్రాక్టర్‌లో సిద్ధగా ఉన్న ఇసుక

వాగులోని ఇసుక అక్రమార్కుల వశమై తరలిపోతోంది. తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామ సమీపంలోని ఈదులవాగులో ఇసుకను రాత్రిపూట పక్కన ఉన్న మండలాల గ్రామాలకు తరలించి లక్షలు ఆర్జిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు  పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుడి ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగడమే అందుకు కారణమని అంటున్నారు. సొంతంగా జేసీబీ, వాహనాలున్న ఆ నాయకుడు రాత్రిపూట వాగులో ఇసుక తోడి తన పొలాల వద్ద నిల్వ చేసి, కృష్ణగిరి, డోన్‌ మండలాల్లోనుంచి ఆర్డర్లు రాగానే ట్రాక్టర్లలో నింపి గుట్టుచప్పుడు కాకుండా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని వివరిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక ట్రాక్టర్‌ ధర రూ.6 వేల నుంచి రూ. 10 వేల వరకు తీసుకొంటున్నట్లు సమాచారం.

న్యూస్‌టుడే, తుగ్గలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని