logo

జిల్లా ఒలింపిక్‌ సంఘం ఎన్నికలకు సన్నద్ధం

జిల్లా ఒలింపిక్‌ సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు నగరంలోని కె.ఇ.ప్లాజాలో ఫిబ్రవరి 5వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

Published : 29 Jan 2023 04:25 IST

24 క్రీడా సంఘాలు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా ఒలింపిక్‌ సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు నగరంలోని కె.ఇ.ప్లాజాలో ఫిబ్రవరి 5వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అదేరోజు అన్ని సంఘాల సమన్వయంతో నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఒలింపిక్‌ సంఘం జిల్లా ఛైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 24 క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు ఓటింగ్‌ పాల్గొనే అవకాశం ఉందని రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఒలింపిక్‌ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు.


వీరు అనర్హులు..

గతంలో ఒలింపిక్‌ సంఘంలో అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగినవారు అదే పదవుల్లో పోటీల్లో చేసేందుకు అర్హత లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు చోటు లేదని క్రీడా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. పోటీ చేసేవారిపై కేసులు ఉన్నా.. పోలీసుస్టేషన్లలో వివరాలు నమోదైనవారు అనర్హులు. నకిలీ క్రీడా పత్రాలు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నవారు సైతం పోటీ చేసేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు. ఒక సంఘంలో.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు.. సభ్యులు ఉండరాదన్న నిబంధనలు ఉన్నాయని జిల్లా అడ్‌హక్‌ కమిటీ సంఘం నాయకులు, క్రీడా సంఘానికి చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.

* 2019 సంవత్సరంలో కర్నూలు ఒలింపిక్‌ సంఘం ఎన్నికను వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు, సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎన్నిక ప్రక్రియ సజావుగా పూర్తిచేసేలా జిల్లా కమిటీ సభ్యులు ప్రతేక చర్యలు తీసుకుంటున్నారు.

* అక్వాటిక్‌ అసోసియేషన్‌ (స్విమ్మింగ్‌), బాక్సింగ్‌ సంఘం, బాస్కెట్‌బాల్‌, ఫెన్సింగ్‌, జిమ్మాస్టిక్స్‌ అసోసియేషన్‌, జూడో సంఘం, కబడ్డీ, ఖోఖో తదితర 24 సంఘాలకు ఓటు హక్కు కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని