Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌  బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఘాట్‌రోడ్‌ లోని రక్షణ గోడను ఢీకొట్టింది.

Updated : 29 Jan 2023 17:16 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం జలాశయం వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జలాశయం వద్దకు రాగానే మలుపు వద్ద అదుపుతప్పింది. డ్రైవర్‌ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఘాట్‌రోడ్‌ లోని రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ గోడ ధ్వంసమైనప్పటికీ, ఇనుప బారికేడ్‌ ఉండటంతో బస్సు లోయలో పడకుండా ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇరువైపులా ఉన్న ఘాట్‌రోడ్‌  మలుపుల వద్ద రక్షణ గోడలు బలహీనంగా ఉన్నాయి. ఇనుప బారికేడ్‌ ఉండటంతో ఇవాళ జరిగిన ప్రమాదం నుంచి 30 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని