logo

దివ్యాంగుడి ప్రత్యేక యాత్ర

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు చేపట్టిన సైకిల్‌ యాత్ర సోమవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చేరింది.

Published : 31 Jan 2023 02:12 IST

ఆదోనిలో దివ్యాంగుడు ప్రసాద్‌

న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు చేపట్టిన సైకిల్‌ యాత్ర సోమవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చేరింది. ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బురదం గ్రామానికి చెందిన ప్రసాద్‌ ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు మూడు చక్రాల సైకిల్‌పై యాత్ర చేపట్టారు. ఆదోని మీదుగా ఆలూరు నుంచి అనంతపురం చేరుకుంటానని ప్రసాద్‌ తెలిపారు. 2018 మార్చి 3న యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. కొవిడ్‌ సమయంలో కొద్ది రోజులు యాత్ర నిలిపివేశానన్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల్లో 192 మండలాల్లో పర్యటించానన్నారు. రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడి పోయిందని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరుడుగా యాత్ర చేస్తూ.. ప్రతి డివిజన్‌, మండల అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ వెళ్తున్నానని వివరించారు. అనంతపురం తర్వాత దిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని