logo

సమాజ హితం.. సేవే అభిమతం

విద్యార్థి దశలో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించి దేశభక్తి చాటేలా సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విభాగం స్కౌట్‌ అండ్‌ గైడ్‌. మూడేళ్లపాటు శిక్షణ పొంది జాతీయ స్థాయి పదర్శనకు వెళ్తే గవర్నర్‌ ద్వారా ధ్రువపత్రం అందిస్తారు.

Published : 02 Feb 2023 03:35 IST

స్కౌట్‌, గైడ్‌ శిక్షణ యువతకు రక్షణ
న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

రాజస్థాన్‌లో పాల్గొన్న స్కౌట్‌ అండ్‌ గైడ్‌ సభ్యులు

విద్యార్థి దశలో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించి దేశభక్తి చాటేలా సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విభాగం స్కౌట్‌ అండ్‌ గైడ్‌. మూడేళ్లపాటు శిక్షణ పొంది జాతీయ స్థాయి పదర్శనకు వెళ్తే గవర్నర్‌ ద్వారా ధ్రువపత్రం అందిస్తారు. దీంతో రైల్వే ఉద్యోగాల్లో పది శాతం, ఇంజినీరింగ్‌, తదితర కోర్సుల్లో కొంతమేర రిజర్వేషన్లు ఉంటాయి. ఈ విభాగంలో చేరిన కొందరు ఎమ్మిగనూరు ఎనిమిది మంది బాలికలు సత్తా చాటి రాజస్థాన్‌లో ప్రతిభా పురస్కారం అందుకున్నారు.

* పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎనిమిది మంది బాలికలు రాష్ట్ర స్థాయి స్కౌట్‌ అండ్‌ గైడ్‌లో పాల్గొని ప్రతిభ చూపారు. పాఠశాలకు చెందిన హేమలత, సాయిశ్రీరచన, హిమశ్రీ, మదీన, సుహానా, చంద్రిక, మహాలక్ష్మి, భవాని, అక్షిత, జ్ఞానేశ్వరి రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలిమర్స్‌లో జనవరి 4వ తేదీ నుంచి 10వతేదీ వరకు శిక్షణ ఇవ్వగా దేశభక్తి, క్రమశిక్షణ, నిరంతరం సేవ, విపత్తు సమయాల్లో రక్షణ వంటి అంశాల్లో చొరవ చూపారు. నాయకత్వ లక్షణాల పెంపు, కమ్యూనికేషన్‌, పరిపాలన, ఏవియేషన్‌ స్కిల్స్‌ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించడం, ప్రథమ చికిత్స, జాతీయ గీతాలాపన, జాతీయ జెండా కట్టే విధానం, ప్రజలను చైతన్యం చేయడం వంటి అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలిచ్చి పురస్కారం అందుకున్నారు.


రెండేళ్లుగా సాధన చేశాను
  - సాయిశ్రీరచన, మాచాని సోమప్ప ఉన్నత పాఠశాల

రాజస్థాన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపేందుకు మా పాఠశాలలో రెండేళ్లుగా సాధన చేశాను. కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్నా. ఈ ఏడాది జాతీయ స్థాయి శిక్షణలో భాగంగా రాజస్థాన్‌లో సమాజ చైతన్యం, సామాజిక, మానసిక, మేధోపరంగా అభివృద్ధి అంశాలపై ప్రతిభ చూపడంతో పురస్కారం అందజేశారు. అక్కడా నాయతక్వ లక్షణాలతోపాటు, నైపుణ్యం, కమ్యూనికేషన్‌, పరిపాలన, ఇతర కార్యక్రమాలపైనా అవగాహన కల్పించారు.


నైతిక విలువలపై అవగాహన
- మరియా, ఎమ్మిగనూరు

ఏపీ తరఫున రాజస్థాన్‌లో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలపై శిక్షణ తీసుకున్నా. నైతిక విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాను. జిల్లాలో  వెనుక బడిన ప్రాంతాల పిల్లలను విద్య వైపు ప్రోత్సహించే అంశంపై శిక్షణ ఇచ్చారు. వయోజనుల్లో అక్షరాస్యత పెంపొదించడంపైనా అవగాహన వచ్చింది. ప్రజా సేవా కార్యక్రమాలపై ధ్యాస పెట్టడం అక్కడ నేర్పారు. శిక్షణతోపాటు నిరంతరం సాధన చేశాను రాజస్థాన్‌లో ఆరు రోజులపాటు వివిధ అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలిచ్చి పురస్కారం అందుకున్నా.


సేవా కార్యక్రమాలపై శిక్షణ
- చంద్రిక, తొమ్మిదో తరగతి  

పాఠశాలలో చేపట్టిన స్కౌట్‌ అండ్‌ గైడ్‌లో చేరి రెండేళ్లుగా శిక్షణ తీసుకున్నా. నిత్యం వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉన్నాం. దేశభక్తి పెంచేలా పాఠాలు, విపత్తులు సంభవిస్తే చేయాల్సిన పనులపై అవగాహన కలిగింది. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే తక్షణమే ప్రథమ చికిత్స చేయించి ఆస్పత్రికి తరలించడం నేర్చుకున్నా. నాయకత్వ లక్షణాలపై నేర్పిన పాఠాలు ఎంతో ఉపయోగపడతాయి. రాజస్థాన్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వారు నేర్పిన అంశాల్లో ప్రతిభ చూపి పురస్కారం అందుకున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని