logo

అమిగోస్‌ అలరిస్తుంది

అభిమానుల నమ్మకం వమ్ముకాకుండా అమిగోస్‌ చిత్రం అలరిస్తుందని సినీ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు.

Published : 04 Feb 2023 03:52 IST

- సినీ హీరో కల్యాణ్‌రామ్‌

అభిమానుల నమ్మకం వమ్ముకాకుండా అమిగోస్‌ చిత్రం అలరిస్తుందని సినీ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన అమిగోస్‌ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత వై.రవిశంకర్‌తో కలిసి నగరంలోని శ్రీరామ్‌ థియేటర్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ  సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలకు తమ్ముడు నందమూరి తారక రామారావు(జూనియర్‌ ఎన్టీఆర్‌) వస్తారన్నారు. కళాతపస్వి విశ్వనాథ్‌ మృతి చిత్రసీమకు తీరని లోటు అన్నారు.నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ అమిగోస్‌ అంటే స్పానిష్‌లో స్నేహితులని అర్థమన్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంప్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని