logo

కర్నూలులో కళాతపస్వి

అత్యద్భుతమైన చిత్రాలు తీయడంలో కళాతపస్వి విశ్వనాథ్‌కు ఎవరూ సాటిరారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందాయి.

Updated : 04 Feb 2023 04:06 IST

జ్ఞాపిక అందుకుంటున్న విశ్వనాథ్‌ (పాత చిత్రం)

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: అత్యద్భుతమైన చిత్రాలు తీయడంలో కళాతపస్వి విశ్వనాథ్‌కు ఎవరూ సాటిరారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందాయి. సినీ విమర్శకులు సైతం ఎంతగానో ఆదరించారు. ఆయన రూపొందించిన చిత్రాలను కర్నూలు నగరంలోని థియేటర్లలో ఒకేరోజు ప్రదర్శించడం విశేషం. 1989 సంవత్సరంలో గుడ్‌ఫ్రైడే రోజున నగరంలోని ఆనంద్‌, అలంకార్‌, నేతాజీ, సాయిబాబా, నవరంగ్‌, నటరాజ్‌, చాంద్‌ థియేటర్లలో శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సాగర సంగమం, సప్తపది, శుభసంకల్పం, శంకరాభరణం చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విశ్వనాథ్‌తోపాటు నటులు మురళీమోహన్‌, భానుచందర్‌, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు తరలివచ్చారు. కర్నూలు క్లాసికల్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్‌, తెదేపా నేత కేఈ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆనాటి గుర్తులు మరిచిపోలేం
- లక్ష్మీనారాయణ రెడ్డి, కర్నూలు క్లాసికల్‌ ఫిల్మ్‌ కార్యదర్శి

అద్భుతమైన కళాచిత్రాలు విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చాయి. అప్పట్లో ఆయన తీసిన చిత్రాలను నగరంలోని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శించారు. ఆయా సినిమాల్లో నటించిన చిత్ర బృందంతోపాటు.. విశ్వనాథ్‌ రావడం ఎప్పటికీ మరిచిపోలేం. ఆనాటి గుర్తులు ఇప్పటికీ కళ్లలో మెదులుతూనే ఉన్నాయి. ఆయనతో మాట్లాడిన ప్రతి మాట మరిచిపోలేం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని