logo

వస్తారు పోతారు.. ఎవరూ పట్టించుకోరు

ఆదోని మండలం సుల్తానాపురం గ్రామంలో శుక్రవారం గడప గపడకు.. మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి సమస్యలతో స్వాగతం పలికారు.

Published : 04 Feb 2023 03:52 IST

సుల్తానాపురంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి సమస్యలు విన్నవిస్తున్న జనం

సుల్తానాపురం(ఆదోని గ్రామీణం), న్యూస్‌టుడే: ఆదోని మండలం సుల్తానాపురం గ్రామంలో శుక్రవారం గడప గపడకు.. మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి సమస్యలతో స్వాగతం పలికారు. ఇంటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇస్తామని చెబుతున్నారని, ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం చేసుకున్నాం, కొంత మొత్తం బిల్లు వచ్చింది, రూ.80వేలు రావాల్సి ఉందని, ఇంత వరకు అందలేదని గ్రామానికి చెందిన కిష్టమ్మ ఎమ్మెల్యేకు వివరించారు. అందరూ వస్తారు పోతారు.. సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. మురుగు కాల్వలు సరిగా లేవని, పింఛను రావడం లేదని, భూ సమస్యలు, ఇంటి బిల్లు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం గ్రామంలో ఎమ్మెల్యే చింతకాయల రాశిని పరిశీలించి, వ్యాపార వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మండల పరిధిలోని పెసలబండ గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మధుసూదన్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శాంత, సర్పంచి మహాదేవి, ఎంపీటీసీ చక్రవర్తి, ఈవోఆర్డీ జనార్దన్‌, వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని