logo

విదేశాల్లో ఉన్నత విద్యకు మార్గం సుగమం

జగనన్న విద్యా దీవెన ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యకు మార్గం సుగమమైందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

Published : 04 Feb 2023 03:52 IST

చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్‌, మేయర్‌ రామయ్య తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జగనన్న విద్యా దీవెన ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యకు మార్గం సుగమమైందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి మన జాతీయ జెండాను ఇతర దేశాల్లోనూ ఎగురవేసే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డా.జె.సుధాకర్‌, మేయర్‌ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్‌ రేణుక, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రతాప్‌ సూర్యనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమాధికారిణి వెంకటలక్షుమమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా మొదటి విడత ఆర్థిక సాయం పొందిన ఇద్దరు విద్యార్థులు (ఎస్సీ-1, మైనార్టీ-1)కు రూ.8.80 లక్షల మెగా చెక్కును వారు అందజేశారు.

ఆ డివిజన్లలో ఆర్‌బీకేల పనితీరు అధ్వానం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రైతుభరోసా కేంద్రాల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆలూరు, ఆదోని, కర్నూలు డివిజన్లలోని కొన్ని రైతు భరోసా కేంద్రాల పనితీరు అంత బాగా లేదని, వీటి పనితీరు మెరుగు పడేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద ఏర్పాటు చేసిన 114 గ్రూపులకు బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయించి, గ్రౌండింగ్‌ ప్రక్రియను 28వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. చిరుధాన్యాల సాగును విస్తరింపజేసేందుకు జిల్లాలో వచ్చే ఐదేళ్లల్లో 5,650 హెక్టార్లలో కొర్ర సాగు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డీఏవో పీఎల్‌ వరలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద 5,600 మంది గేదెల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 1,573 మందికి రుణాలు మంజూరు చేయించినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డా.రామ చంద్రయ్య వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని