logo

విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి

విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు చేస్తూ పలువురి చేత శెభాష్‌ అనిపించుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు.

Published : 05 Feb 2023 02:24 IST

 ప్రదర్శనను తిలకిస్తున్న కలెక్టర్‌, అధికారులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు చేస్తూ పలువురి చేత శెభాష్‌ అనిపించుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని టౌన్‌ మోడల్‌ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్సు కాంగ్రెస్‌ను శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమకు వచ్చిన ఆలోచనలకు పదును పెట్టి సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. డీఈవో రంగారెడ్డి మాట్లాడుతూ 2022 నవంబరులో పాఠశాల స్థాయిలో, డిసెంబరులో మండల స్థాయి సైన్సు ప్రదర్శన జరిగిందన్నారు. వీటి నుంచి జిల్లా స్థాయికి 125 ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. ఈనెల 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు కర్నూలు జిల్లా నుంచి 10 ప్రాజెక్టులు పంపుతున్నట్లు చెప్పారు. మేయర్‌ బీవై రామయ్య తదితరులు ప్రదర్శనను తిలకించారు.  సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త వేణుగోపాల్‌, జిల్లా సైన్సు అధికారిణి రంగమ్మ, డిప్యూటీ డీఈవో హనుమంతరావు హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు