logo

చిట్టి బుర్రలు.. గట్టి ఆలోచనలు

సాంకేతిక పరంగా దేశం అభివృద్ధి చెందింది. పలు అంశాల్లో ముందుకు దూసుకెళ్తోంది. విద్యా శాఖ సైతం విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసేందుకు తగిన చర్యలు చేపడుతోంది.

Updated : 05 Feb 2023 03:24 IST

ఆకట్టుకున్న జిల్లా స్థాయి సైన్సు ప్రదర్శన

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : సాంకేతిక పరంగా దేశం అభివృద్ధి చెందింది. పలు అంశాల్లో ముందుకు దూసుకెళ్తోంది. విద్యా శాఖ సైతం విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసేందుకు తగిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తోంది. పిల్లలు సైతం తమ ఆలోచనలకు రూపమిస్తున్నారు. వినూత్నమైన పరికరాలను ఆవిష్కరిస్తున్నారు. నగరంలోని టౌన్‌ మోడల్‌ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. కర్నూలు జిల్లా నుంచి 120 ప్రాజెక్టులు వచ్చినట్లు డీఈవో రంగారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు ప్రదర్శనలు రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నారు.


ఆరోగ్య సూత్రం

* ఆరోగ్య సూత్రం.. ఆహ్లాదం

* వైష్ణవి, హేమలత, స్నేహ, మనీషా, మహిమరాణి, చంద్రిక, గోనెగండ్ల కేజీబీవీ

* ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని చూసి తట్టిన ఆలోచన

*  నిత్యం మనం తినే ఆహారంలో ఎక్కువగా జంక్‌ఫుడ్‌ ఉంటోంది. ఫలితంగా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. వీటి నుంచి బయట పడడంతోపాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలపై పట్టు సాధించాలి.

* పప్పు దినుసులు తీసుకోవడంతో ఆరోగ్యం పదిలంగా ఉండడంతోపాటు ఊబకాయం నుంచి బయట పడవచ్చు.


ప్రమాదాలపై అప్రమత్తం

* గ్యాస్‌ కారణంగా జరిగే ప్రమాదాల నుంచి అప్రమత్తం చేయడం..

* సి.కిశోర్‌ (పదో తరగతి), జొన్నగిరి ఉన్నత పాఠశాల.

* రెండేళ్ల కిందట కోస్తా ప్రాంతంలో ఓ కర్మాగారంలో గ్యాస్‌ లీకేజీతో పలువురు చనిపోయారు. మరికొందరు శ్వాసకోశతో ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వినూత్నంగా రూపొందించారు.

* భారీగా గ్యాస్‌ తయారు చేసే కంపెనీల వద్ద, పెద్దపెద్ద గ్యాస్‌ పైపులైన్ల వద్ద సెన్సార్లు ఏర్పాటు చేస్తే గ్యాస్‌ లీకేజీ ఏర్పడినప్పుడు వెంటనే అలారంతో అప్రమత్తం చేస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెంటనే సూచనలు ఇస్తుంది.

* ప్రమాదాల నుంచి బయట పడవచ్చు.


జలాశయానికి ముప్పు లేకుండా..

* స్మార్ట్‌ డ్యాం

*  రఘునందన ఆచారి, హెచ్‌.కైరవాడి జడ్పీ ఉన్నత పాఠశాల

* 2009లో కర్నూలుకు పెద్దఎత్తున వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాన్ని నివారించేలా ఆలోచించారు.

* జలాశయం సామర్థ్యం కంటే ఎక్కువ మోతాదులో వరద నీరు వచ్చినప్పుడు  ప్రత్యేకించి సిబ్బంది గేట్లు తెరవాల్సి ఉంటుంది. దీంతోపాటు హెచ్చరికలు జారీ చేయాలి. డ్యామ్‌కు సెన్సార్లు ఏర్పాటుచేసిన నీటి సామర్థ్యాన్ని కొలిచే పరికరం అమర్చడం..

* నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు తెరుచుకోవడం ద్వారా నీరు కిందకి వెళుతుంది. డ్యామ్‌పై అమర్చిన సెరన్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తాయి.


అంధులకు ఉపయుక్తంగా..

*  థర్డ్‌ ఐ ఫర్‌

* సైఫుల్లా, ప్రవీణ్‌ కుమార్‌ (8వ తరగతి). దేవనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల

* అంధులు పడే ఇబ్బందులను చూసి..

* అంధులు చాలా మంది రోడ్డు దాటాలన్నా, ఎదురుగా ఏముందో తెలుసుకోవడం కష్టం. వారు పెట్టుకునే కంటి అద్దాలకు సెన్సర్లు అమర్చితే పది అడుగుల దూరంలో ఎవరో వస్తున్నారని.. ఏదో వస్తువు అడ్డుగా ఉందని హెచ్చరిస్తుంది.

* అంధులు సులువుగా రోడ్డు దాటొచ్చు.


పంటకు రక్ష

* పంట పొలానికి రక్షణ

* కె.జగన్‌ (6వ తరగతి), జడ్పీ ఉన్నత  పాఠశాల, కంబాలపాడు, కృష్ణగిరి మండలం

* నాన్నతో కలిసి పొలానికి వెళ్లినప్పుడు పంటను పక్షులు తినడం చూశా. వీటి నుంచి రక్షణగా పరికరం తయారు చేయాలనుకున్నా.

* సూర్యరశ్మితో పనిచేసే సోలార్‌ ప్యానల్‌ను సిద్ధం చేసుకోవాలి. కర్రకు స్టీల్‌ ప్లేటు.. దీనిపై చిన్నపాటి మోటారుతో ఇనుప కడ్డీ శబ్దం చేసేలా అమర్చుకోవాలి. దీనికి విద్యుత్తు అవసరం. పొలంలో విద్యుత్తు సరఫరా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సోలార్‌ ప్యానల్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసి మోటారుకు సరఫరా చేస్తుంది. సూర్య కిరణాలు ఉన్నంతసేపు శబ్దం వస్తూనే ఉంటుంది.

* పంటలను పూర్తిస్థాయిలో రక్షించుకోవచ్చు.


బిల్లుల భారం నుంచి ఉపశమనం

* కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు.

* ఈశ్వర్‌ (9వ తరగతి), ఇమ్రాన్‌ (8వ తరగతి), జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఉయ్యాలవాడ

* భారీగా విద్యుత్లు బిల్లులు పెరిగిపోవడంతో తగ్గించేలా ఆలోచన

* కొంత పెట్టుబడి పెట్టి గాలిమరలు అమర్చుకోవాలి. గాలి ద్వారా గాలిమరలకు ఉన్న పంకాలు తిరగడంతో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్తును ఇళ్లకు, పొలాలకు వినియోగించుకోవచ్చు.

* ఎక్కువగా వస్తున్న బిల్లుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని