logo

పట్టపగలే భారీ చోరీ

పట్టణంలో పట్టపగలు దొంగలు చెలరేగిపోయారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు.

Published : 05 Feb 2023 02:24 IST

27 తులాల బంగారు,   రూ.5 వేల నగదు అపహరణ

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం సభ్యులు

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలో పట్టపగలు దొంగలు చెలరేగిపోయారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు పట్టణంలోని ఎస్‌ఎంటీ కాలనీ దగ్గరలో ఉన్న షేక్‌ మహబూబ్‌బాషా, ఆయన భార్య ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. శుక్రవారం ఉదయం ఇద్దరు పాఠశాలలకు వెళ్లారు. కుమారుడు మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నమాజ్‌కు వెళ్లారు. ఆ సమయంలో తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న 27 తులాల బంగారు నగలు చోరీ చేశారు. తర్వాత అక్కడే జీఎం పెట్రోల్‌ బంకు దగ్గరలో ఉంటున్న మఠం శివప్రసాద్‌ ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాను పగలగొట్టి బంగారు కమ్మలు, ఉంగరం, రూ.5వేలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు ఇళ్లకు వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి శనివారం క్లూస్‌ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని