logo

11 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న శనివారం తెలిపారు.

Published : 05 Feb 2023 02:24 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న శనివారం తెలిపారు. 11న ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ పూజలు చేయనున్నట్లు వెల్లడించారు. 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ, 14న మయూర వాహన సేవ, 15న రావణ వాహన సేవ, 16న పుష్ప పల్లకి సేవ, 17న గజ వాహన సేవ, 18న మహా శివరాత్రి పర్వదినం రోజున నంది వాహన సేవ, ప్రభోత్సవం, బ్రహ్మోత్సవ కల్యాణం, 19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి ఉంటాయన్నారు. 21న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని