logo

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఉత్తమ వైద్యం అందించడం ద్వారా ప్రమాదాన్ని నివారించొచ్చని.. దీనిపై మహిళలకు క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Feb 2023 03:39 IST

ర్యాలీలో పాల్గొన్న ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఉత్తమ వైద్యం అందించడం ద్వారా ప్రమాదాన్ని నివారించొచ్చని.. దీనిపై మహిళలకు క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు వైద్య కళాశాలలోని ఓల్డ్‌ సీఎల్‌జీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మహిళలకు రొమ్ము, సర్వేకల్‌ క్యాన్సర్‌ వంటివి వస్తుంటాయని, చాలామంది పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారని చెప్పారు. సర్వజన వైద్యశాలలో ఓపీ 14లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ప్రపంచ క్యాన్సర్‌ దినాన్ని పురస్కరించుకొని వైద్య కళాశాల నుంచి ఓల్డ్‌ సీఎల్‌జీ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గైనిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ వెంకటరమణ, వైద్యులు మాణిక్యరావు, రామచంద్రనాయుడు, ప్రభాకరరెడ్డి, ఐఏఎంసీ అధ్యక్షుడు రమేష్‌, రాధారాణి, ప్రకాష్‌, మాధవి శ్యామల, రాచంద్రనాయుడు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు