logo

కదం తొక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు

కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని.. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని, పలు విభాగాల అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారని.. దీనిని ఆపాలని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు డిమాండ్‌ చేశారు.

Published : 07 Feb 2023 04:30 IST

ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఈనాడు-కర్నూలు, న్యూస్‌టుడే, బి.క్యాంప్‌ : కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని.. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని, పలు విభాగాల అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారని.. దీనిని ఆపాలని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదిస్తూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌కు సోమవారం భారీగా తరలొచ్చారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలు పి.నిర్మల మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. యాప్‌లతో పని ఒత్తిడి పెంచి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు రేణుకమ్మ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ఇంట్లో పనివారికి అంగన్‌వాడీల ఏకరూప దుస్తులే కేటాయించి అవమానించారని, పనివాళ్లతో పోల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ పీడీ రమాదేవి వారి నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని