logo

తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.

Published : 07 Feb 2023 04:30 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఆయన సోమవారం అన్ని శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఉపాధి కూలీలకు పనులు చూపాలని, కూలీలకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న తోడుకు సంబంధించి చిరు వ్యాపారుల దరఖాస్తులను ఈనెల 10వ తేదీలోగా బ్యాంకులకు పంపాలని ఎంపీడీవోలకు సూచించారు. వేసవి సమీపిస్తోందని, తాగునీటి ఎద్దడికి సంబంధించి 484 గ్రామ పంచాయతీల నుంచి పది రోజుల్లో వేసవి ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. చేతిపంపులు, బోర్లు, పైపులైన్లు, బోర్‌వెల్స్‌ తదితర వాటిపై నివేదిక ఇవ్వాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎంత ఖర్చవుతుందో నివేదికలు ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఎంపీడీవోలను ఆదేశించారు. ముఖ హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ వారంలోగా ఈ.పంట నమోదు పరిశీలన పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమీక్షలో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, సీపీవో అప్పలకొండ, పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని