logo

తాఖీదులకు స్పందించని అధికారులు

ఆర్‌యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరిగాయని.. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారని పలువురు విద్యార్థి సంఘాల నేతలు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Published : 07 Feb 2023 04:30 IST

చట్టపరమైన చర్యలకు సీఐడీ రంగం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఆర్‌యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరిగాయని.. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారని పలువురు విద్యార్థి సంఘాల నేతలు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్‌యూ ఉన్నత అధికారులకు సీఐడీ అధికారులు పది నెలల కింద నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు నాలుగు సార్లు తాఖీదులు ఇచ్చినట్లు సమాచారం. 91 సీఆర్‌పీ నోటీసును 20 రోజుల కిందట ఇచ్చారు. 15 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన గడువు ముగిసినా.. ఆర్‌యూ నుంచి సమాధానం రాలేదని.. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర సీఐడీ కార్యాలయాన్ని జిల్లా సీఐడీ అధికారులు కోరినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని