logo

పది వేల హెక్టార్లలో పంట నష్టం

జిల్లాలో గత రెండ్రోజులుగా కురిసిన అకాల వర్షాలకు కోతకొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Published : 19 Mar 2023 02:20 IST

తడిసిన మిరపను ఆరబెడుతున్న రైతులు

పాణ్యం, పాణ్యం గ్రామీణం న్యూస్‌టుడే: జిల్లాలో గత రెండ్రోజులుగా కురిసిన అకాల వర్షాలకు కోతకొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, పశు సంపద తదితర అంశాలపై అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు. అరటి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మినుము, కొర్ర, ఆముదం, బొప్పాయి, మామిడి, మునగ, జామ తదితర పంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యానవన శాఖాధికారి నాగరాజు పేర్కొన్నారు.

* గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో 6861.66 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. ఆళ్లగడ్డలో 1725 హెక్టార్లు, రుద్రవరం(1567), కోవెలకుంట్ల(808), చాగలమర్రి(779), ఉయ్యాలవాడ (668), శిరివెళ్ల (325.2), గోస్పాడు(295), బనగానపల్లి (170), గడివేముల(145), మిడ్తూరు( 139), బండిఆత్మకూరు(120), జూపాడుబంగ్లా (54), సంజామల మండలంలో 60 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, కొర్ర, మినుము, ఆముదం తదితర పంటలు దెబ్బతిన్నాయి.

* జిల్లాలో 3263.4 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఉయ్యాలవాడ మండలంలో 369 హెక్టార్లు, కోవెలకుంట్ల (1134), సంజామల(1393), కొలిమిగుండ్ల(110), గడివేముల (28.8), మహానంది(13), బండిఆత్మకూరు (12), మిడ్తూరు (118), రుద్రవరం(10.6), చాగలమర్రి(5), డోన్‌ మండలంలో 70 హెక్టార్లలో మిరప, అరటి, బొప్పాయి, మునగ, మామిడి, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని