logo

ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం నోరు విప్పాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా వారు గెలుపొందిన విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడటం సబబు కాదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోరు విప్పాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

Published : 21 Mar 2023 02:26 IST

తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా వారు గెలుపొందిన విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడటం సబబు కాదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోరు విప్పాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. యువతకు ప్రాధాన్యమిస్తామని చెప్పి సీఎం మోసగించారని ధ్వజమెత్తారు. పట్టభద్రులైన ఓటర్లను కించపరిచేలా ప్రభుత్వ సలహాదారు మాట్లాడారన్నారు.  రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 175 సీట్లు గెలుస్తామని కలలు కంటున్న జగన్‌మోహన్‌రెడ్డికి 17 సీట్లు రావడం కష్టమేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని