logo

చదువుతోపాటు సామాజిక స్పృహ అవసరం

విద్యార్థులు చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని డీఈవో రంగారెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ఆర్‌సీ రెడ్డి డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు సోమవారం నిర్వహించారు.

Published : 21 Mar 2023 02:26 IST

కర్నూలు డీఈవో రంగారెడ్డి

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని డీఈవో రంగారెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ఆర్‌సీ రెడ్డి డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 8, 9, 10 తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌, స్టోరీ టెల్లింగ్‌ పోటీల్లో పాఠశాల, ప్రాంతీయ స్థాయిల్లో గెలిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో పోటీ పడ్డారు. ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ‘ఈనాడు’ తరఫున బహుమతులు, ప్రశంసాపత్రాలను డీఈవో అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ రామచంద్రారెడ్డి, ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి మహ్మద్‌ ఖాదర్‌ హుస్సేన్‌ అలి, న్యాయనిర్ణేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నాలుగు నెలలు.. 27,421 మంది విద్యార్థులు

విద్యార్థుల్లో సృజనాత్మక సామర్థ్యాలు వెలికితీయాలన్న సదాలోచనతో గతేడాది నుంచి ‘ఈనాడు’ ప్రతిభా పాటవ పోటీలు నిర్వహిస్తోంది. క్విజ్‌, చిత్రలేఖనం, వ్యాసరచన, కథ చెప్పడం అంశాల్లో పోటీల నిర్వహణకు కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, డోన్‌, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలను వేదికలుగా ఎంపిక చేశారు. ప్రతి కేంద్రం పరిధిలో 10 చొప్పున మొత్తం 60 పాఠశాలలు ఎంచుకున్నారు. గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలలో మొదటి దశలో పాఠశాల స్థాయిలో పోటీలు జరిగాయి. మొత్తం 27,421 మంది విద్యార్థులు పాల్గొనగా 720 మంది విజేతలుగా నిలిచి ప్రాంతీయ స్థాయి (రెండో దశ) పోటీలకు ఎంపికయ్యారు. రెండో దశలో భాగంగా ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి పోటీలకు మొత్తం 720 మంది హాజరుకాగా అందులో 72 మంది మూడో దశ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరికి సోమవారం పోటీలు నిర్వహించగా అందులో నుంచి 12 మంది రాష్ట్ర స్థాయి పోటీలు అర్హత సాధించారు.

జిల్లా స్థాయి విజేతలు వీరే..

స్టోరి టెల్లింగ్‌: డి.అయిషా (శ్రీసుధా విద్యాలయ పాఠశాల, డోన్‌), తేజల్‌ (కిడ్డీ రూట్స్‌ గ్లోబల్‌ పాఠశాల, ఆదోని), నౌషిన్‌ (శ్రీ చైతన్య పాఠశాల, ఎమ్మిగనూరు)

క్విజ్‌: హర్షవర్దన్‌ (కస్తూరి స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, కర్నూలు), సత్యప్రకాష్‌ (మాంటిస్సోరి హైస్కూల్‌, ఏక్యాంపు కర్నూలు), లీలాధర్‌ (సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాల, బెతంచేర్ల)

వ్యాసరచన: హర్షిత యాదవ్‌ (శ్రీపద్మావతి హైస్కూల్‌, ఆత్మకూరు), డీబా ఫాతిమా (మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్‌, కర్నూలు) పటేల్‌ రూప (కిడ్డీ హై స్కూల్‌, ఆదోని)

చిత్రలేఖనం: రాఫెల్‌ వైక్లైట్‌ (మిల్టన్‌ జెమ్‌ పాఠశాల, ఆదోని), సన (శ్రీపద్మావతి ఉన్నత పాఠశాల, ఆత్మకూరు), హరిప్రియ (భాష్యం హైస్కూల్‌, ఆదోని)

విజేతలతో డీఈవో రంగారెడ్డి,‘ఈనాడు’ కర్నూలు యూనిట్‌ ఇన్‌ఛార్జి మహ్మద్‌ ఖాదర్‌ హుస్సేన్‌ అలి తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని