logo

వీరభద్రుని గ్రామోత్సవం.. కాళమ్మకు సంబరం

మండలంలోని కైరుప్పల గ్రామంలో శైవక్షేత్రమైన వీరభద్రస్వామి, కాళమ్మదేవి ఆలయంలో బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

Published : 21 Mar 2023 02:26 IST

పెళ్లికొడుకు అలంకరణలో వీరభద్రస్వామి

కైరుప్పల(ఆస్పరి), న్యూస్‌టుడే: మండలంలోని కైరుప్పల గ్రామంలో శైవక్షేత్రమైన వీరభద్రస్వామి, కాళమ్మదేవి ఆలయంలో బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం మొలకలు నాటడడం, ధ్వజారోహణం కార్యక్రమాలను ఆలయ అర్చకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తునట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్‌ తెలిపారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆస్పరి ఎస్సై వరప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని