logo

శ్రీగిరిపై కన్నడిగుల భక్తిపారవశ్యం

శ్రీశైల మహాక్షేత్రం లక్షలాదిమంది కన్నడ భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలిరావడంతో క్షేత్ర పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.

Updated : 21 Mar 2023 07:28 IST

పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రం లక్షలాదిమంది కన్నడ భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలిరావడంతో క్షేత్ర పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. కన్నడ, మరాఠా భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. దర్శనం కాగానే కొందరు భక్తులు తిరుగుముఖం పడుతున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛంద సేవకులు, కన్నడ భక్తులు వాలంటీర్లుగా పనిచేస్తూ భక్తులకు అవసరమైన సమాచారం తెలియజేస్తున్నారు.

గ్రామోత్సవం ఎదుట కళాకారుల సందడి

అన్నపూర్ణ ఆశ్రమంలో అన్నదానం

శ్రీశైలంలోని ఘంటామఠం సమీపంలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆశ్రమంలో శివోహం టెంపుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కన్నడ భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. మూడు పూటలా అన్నప్రసాదం అందజేస్తున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు అన్నదానం కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీశైలంలో నేడు...

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల మూడోరోజు మంగళవారం భ్రమరాంబాదేవి, మల్లికార్జున స్వామివార్లకు సాయంత్రం 5 గంటల ప్రభోత్సవం జరుగనుంది. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.

భక్తులకు అన్నదాన కార్యక్రమం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని