logo

అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి అమానుషం

అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే, తెదేపాకు చెందిన ఎమ్మెల్యేలపై దాడి చేయడం అమానుషమని నియోజకవర్గ తెదేపా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు రాయలసీమ సలాం, ఎస్టీ విభాగం జిల్లా నాయకుడు కృష్ణనాయక్‌, పట్టణ నాయకులు బురానుద్దీన్‌, ఖాసీం, కలాం, అల్తాఫ్‌ అన్నారు.

Published : 21 Mar 2023 02:26 IST

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న తెదేపా నాయకులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే, తెదేపాకు చెందిన ఎమ్మెల్యేలపై దాడి చేయడం అమానుషమని నియోజకవర్గ తెదేపా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు రాయలసీమ సలాం, ఎస్టీ విభాగం జిల్లా నాయకుడు కృష్ణనాయక్‌, పట్టణ నాయకులు బురానుద్దీన్‌, ఖాసీం, కలాం, అల్తాఫ్‌ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల గెలవడంపై వైకాపా నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. దాడిని ముఖ్యమంత్రి ప్రోత్సహించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అహ్మద్‌, మదార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని