logo

హిందూ దేవాలయాల జోలికొస్తే ఊరుకోం

హిందూ దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హిందూ ధార్మిక సంఘాల నాయకులు భాజపా జిల్లా నాయకులు హేమసుందర్‌రెడ్డి, వడ్డేమహరాజ్‌ అన్నారు.

Updated : 21 Mar 2023 04:30 IST

డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న హిందూ ధార్మిక సంఘాల నాయకులు

డోన్‌, న్యూస్‌టుడే: హిందూ దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హిందూ ధార్మిక సంఘాల నాయకులు భాజపా జిల్లా నాయకులు హేమసుందర్‌రెడ్డి, వడ్డేమహరాజ్‌ అన్నారు. డోన్‌ పట్టణంలోని మాలిక్‌బాబా ఆలయం వెనుక వాగుపక్కన ఉన్న శివాలయం వద్ద ఆలయనిర్వాహకుడు, హిందూసాధువుపై కొందరు దుర్భాషలాడి, దాడికి యత్నించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం నుంచి డోన్‌ డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 40 మంది అన్యమతస్థులు వచ్చి ఇక్కడ శివాలయం ఉండకూడదని బెదిరించారన్నారు. రెండురోజులు సమయం ఇస్తున్నామని, ఇక్కడి నుంచి వెళ్లకపోతే శివాలయాన్ని తొలగిస్తామని అక్కడే ఉన్న నిర్వాహుకుడిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. దాడికి పాల్పడిన వారి వివరాలతో సహా పోలీసులకు ఇచ్చామని, అయినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్సై నగేష్‌కు వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు ఆర్మీరామయ్య, వీహెచ్‌పీఎస్‌ పామయ్య, రామకృష్ణ, సుధాకర్‌, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని