logo

అధికార డబ్బు అందలేదా?

అధికారంలో ఉండి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం స్థానం చేజారడంపై వైకాపాలో అంతర్మథనం మొదలైంది.

Published : 21 Mar 2023 02:26 IST

ఎమ్మెల్సీ ఓటమిపై వైకాపా నేతల అనుమానం

ఈనాడు, కర్నూలు: అధికారంలో ఉండి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం స్థానం చేజారడంపై వైకాపాలో అంతర్మథనం మొదలైంది. నేతల మధ్య సమన్వయం కొరవడటం.. అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి సమకూర్చిన డబ్బులు ఓటర్లకు చేరకపోవడం వల్లే ఓటమి పాలనైట్లు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,16,553 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఎలాగైనా విజయకేతనం ఎగరవేయాలన్న ఉద్దేశంతో దొంగ ఓట్లను నమోదు చేయించారు. అలాగే ప్రతి ఓటరుకు రూ.1,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఓటరు చీటీతోపాటు డబ్బులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి లీడర్లు, కొన్ని చోట్ల వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అయితే అభ్యర్థి సమకూర్చిన డబ్బు ఓటరు ఇంటికి చేరలేదు.. మధ్యలోనే కొందరు స్వాహా చేసినట్లు ఆ పార్టీలో కొందరు నేతలు పేర్కొంటున్నారు. దీనిపై అధికార పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా రెండో ప్రాధాన్య ఓటుపై నేతలు ప్రచారం చేయలేదు.. కేవలం మొదటి ప్రాధాన్య ఓటుపైనే గెలవాలన్న అత్యాశకు వెళ్లి బోల్తాపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని