logo

మనోరథంపై మల్లన్న

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో  భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. భక్తజన కరతాళ ధ్వనుల మధ్య స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు.

Published : 23 Mar 2023 02:06 IST

 

న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో  భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్ల రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. భక్తజన కరతాళ ధ్వనుల మధ్య స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు. అనంతరం రథశాల నుంచి నందిమండపం వరకు రథోత్సవం వైభవంగా జరిగింది. రథం ఎదుట కన్నడ కళాకారులు వివిధ వేషధారణలతో నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. లక్షలాది మంది కన్నడ భక్తులు రథోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మికానుభూతి చెందారు.


రాజరాజేశ్వరి అలంకారం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం అక్కమహాదేవి మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి భక్తులకు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.


అడ్డపల్లకి సందడి

రథోత్సవంలో జగద్గురు పిఠాధిపతి డాక్టర్‌ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య

మహాస్వామి, దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తదితరులు

ఉగాది పర్వదినం సందర్భంగా కన్నడిగుల ఆధ్యాత్మిక గురువైన జగద్గురు పీఠాధిపతి డాక్టర్‌ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి అడ్డపల్లకిలో తరలివచ్చారు. భక్తులు స్వామీజీని అడ్డపల్లకిలో మోసుకుంటూ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు