logo

అందని ఆసరా

మహిళలు తీసుకున్న పొదుపు రుణాలను నాలుగు దశల్లో రుణ మాఫీ చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. రెండు దశల్లో రుణమాఫీ కింద నగదు జమ చేసింది.

Published : 24 Mar 2023 05:02 IST

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, కల్లూరు గ్రామీణ

మహిళలు తీసుకున్న పొదుపు రుణాలను నాలుగు దశల్లో రుణ మాఫీ చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. రెండు దశల్లో రుణమాఫీ కింద నగదు జమ చేసింది. ఈ ఏడాది జనవరిలో జమ చేయాల్సిన సొమ్మును నేటికీ ఖాతాల్లో వేయలేదు. ఫలితంగా పొదుపు మహిళలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి వీరికి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆరు లక్షల మందికిపైగా పొదుపు మహిళలు ఉన్నారు. వారికి ఈ ఏడాది ఆసరా పథకం కింద రూ.228.17 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. మార్చి 25వ తేదీనాటికి వైఎస్సార్‌ ఆసరా డబ్బులను పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే పొదుపు మహిళల చేత బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ (ఈ-కేవైసీ) చేయిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆ సొమ్ము ఖాతాల్లో వేస్తారా? లేదా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తప్పని ఎదురుచూపులు

గ్రామీణాభివృద్ధి పరిధిలో సున్నా వడ్డీ, ఆసరా పథకం కింద ప్రభుత్వ సాయం కోసం పొదుపు సంఘాల మహిళలు ఎదురు చూస్తున్నారు.. ఆసరా కింద రుణ మాఫీ సొమ్ము తమ ఖాతాలో పడితే కొంత ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. అధికారులు చెప్పినవిధంగా ఆసరా సొమ్ము 11 రోజుల్లో జమవుతుందా? లేదా? అన్నది అనుమానంగానే ఉందని పొదుపు మహిళలు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని వేలాది స్వయం సహాయక సంఘాల పొదుపు మహిళలు సైతం ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెలలో ఆసరా రుణ మాఫీ చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


జిల్లా పొదుపు సభ్యులు ఈ ఏడాది జమ కావాల్సిన సంఘాలు ఆసరా(రూ.కోట్లలో)
కర్నూలు  17,353 1,73,530 91.35
నంద్యాల  21,006 2,10,060 136.82


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని