logo

వైకాపా పతనం ప్రారంభమైంది: మాజీ ఎమ్మెల్యే బీసీ

వైకాపాకు పతనం ఆరంభమైందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనురాధ ఎన్నిక కావడంపై గురువారం రాత్రి సంబరాలు చేసుకున్నారు

Published : 24 Mar 2023 05:02 IST

కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బీసీ

బనగానపల్లి, న్యూస్‌టుడే: వైకాపాకు పతనం ఆరంభమైందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనురాధ ఎన్నిక కావడంపై గురువారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ.. సొంత పార్టీలోనే వైకాపాకు అసమ్మతి సెగలు తగులుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ముగ్గురు తెదేపా అభ్యర్థులు గెలువగా, ఎమ్మెల్యే కోటా సైతం తెదేపా విజయం సాధించడం హర్షణీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యకర్తలతో కలిసి బీసీ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టంగుటూరి శీనయ్య, రాయలసీమ సలాం, ఖాసీం, కలాం, కృష్ణనాయక్‌, బత్తుల బాలిరెడ్డి, బురానుద్దీన్‌, భాస్కరరెడ్డి, వెంకటాపురం నాగేశ్వరరెడ్డి, రాళ్లకొత్తూరు రాముడు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు