ఉద్యోగులకు పూచీకత్తు పాట్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు పూచీకత్తు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
26వ తేదీలోగా అందించాలని ఆదేశం
కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు పూచీకత్తు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లు రూ.3 లక్షల బాండుతోపాటు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో పూచీకత్తు సంతకాలు చేయించిన పత్రాలు అందించాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఐఎంఎల్ డిపో మేనేజర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 10వ తేదీలోగా పూచీకత్తు సమర్పించాలని మొదట గడువు విధించారు. మళ్లీ 15వ తేదీకి పొడిగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 162 మంది సూపర్‌వైజర్లు, 450 మంది సేల్స్‌మెన్‌లు ఉండగా కర్నూలు జిల్లాలో కేవలం ఇప్పటి వరకు 22 మంది సూపర్‌వైజర్లు, 30 మంది సేల్స్‌మెన్‌లు మాత్రమే పూచీకత్తు సమర్పించారు. చాలామంది వీటిని అందించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం మళ్లీ ఐఎంఎల్ డిపో మేనేజర్లు మరో హెచ్చరిక జారీ చేశారు. 26వ తేదీలోగా పూచీకత్తు అందించకపోతే 28వ తేదీన ఉద్యోగం నుంచి తొలగిస్తామని, కొత్తవారిని తీసుకుంటామని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు.. భారత్ తుది జట్టు ఇదేనా?
-
Crime News
ప్రభుత్వ హాస్టల్లో యువతిపై హత్యాచారం.. ఆపై అనుమానిత గార్డు ఆత్మహత్య..!
-
World News
Pakistan: డబ్బు కోసం పాక్ తిప్పలు.. అమెరికాలో రూజ్వెల్ట్ హోటల్ తనఖా
-
Crime News
Crime News: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
-
General News
TTD Temple: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
-
Movies News
Rana: మళ్లీ అలాంటి స్టార్ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా