logo

పిడకల సమరం.. భలే సంబరం

ఆస్పరి మండలం కైరుప్పలలో వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన నుగ్గలాట ఆకట్టుకుంది.

Published : 24 Mar 2023 05:02 IST

కైరుప్పలలో ఆకట్టుకున్న నుగ్గులాట

పిడకలు విసురుకుంటున్న గ్రామస్థులు

ఆస్పరి మండలం కైరుప్పలలో వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన నుగ్గలాట ఆకట్టుకుంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో గ్రామస్థులు అమ్మవారి వైపు కొందరు, స్వామి వైపు మరికొందరు విడిపోయారు. కారుమంచి రెడ్డి తన అనుచరులతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి స్వామిని దర్శించుకొన్నారు. వెంటనే భక్తులు పరస్పరం పిడకలు విసురుకున్నారు. తమ దేవళ్లను గెలిపించుకోవాలనే తపనతో మహిళలూ సమరోత్సవంలోకి దిగారు. వేడుకను చూసేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్ణాటక తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గాయాలైన వారికి స్వామి వారి వద్ద ఉన్న పిడకను కాల్చిన బూడిదనే మందుగా రాయడం ఆనవాయితీ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, ఆలూరు సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆస్పరి, ఆలూరు, ఎస్సైలు వరప్రసాద్‌, డాక్టర్‌ నాయక్‌తో పాటు 50మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.
న్యూస్‌టుడే, ఆస్పరి, ఆలూరు గ్రామీణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని