సోనోవిజన్ విజేతలకు బహుమతులు
కర్నూలు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని సోనోవిజన్ షోరూంలో గురువారం లక్కీడ్రా తీశారు. ఉగాది డిస్కౌంట్ సేల్ సందర్భంగా కొనుగోలుదారులకు కూపన్లు అందించారు.
లక్కీడ్రాలో కూపన్ తీసి చూపుతున్న డీఎస్పీ మహేష్
కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని సోనోవిజన్ షోరూంలో గురువారం లక్కీడ్రా తీశారు. ఉగాది డిస్కౌంట్ సేల్ సందర్భంగా కొనుగోలుదారులకు కూపన్లు అందించారు. అందులో నుంచి కూపన్లు తీసి విజేతలకు బహుమతులు ప్రకటించారు. డీఎస్పీ మహేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతల వివరాలు వెల్లడించారు. మొదటి బహుమతి బి.ధర్మరెడ్డి (మారుతి కారు), రెండో బహుమతి షేక్ అర్షద్‌అలీ (ఎల్‌ఈడీ టీవీ), మూడో బహుమతి షేక్ వలి (రిఫ్రిజిరేటర్), నాలుగో బహుమతి హెచ్.వినోద్‌కుమార్ (వాషింగ్ మిషన్) గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు అందిస్తూ వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. షోరూం బ్రాంచ్ మేనేజర్ అచ్యుత్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులకు తమ సంస్థ తక్కువ ధరలకు అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోనోవిజన్ షోరూం ప్రతినిధులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్