logo

తెదేపా శ్రేణుల సంబరాలు

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనురాధ గెలుపొందడంతో కల్లూరు పట్టణ, గ్రామీణ పరిధిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు గురువారం సంబరాలు చేసుకున్నారు

Published : 24 Mar 2023 05:11 IST

సంబరాల్లో గౌరుదంపతులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనురాధ గెలుపొందడంతో కల్లూరు పట్టణ, గ్రామీణ పరిధిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు గురువారం సంబరాలు చేసుకున్నారు. కర్నూలులోని మాధవి నగర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తమరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, గంగాధర్‌గౌడ్‌, కేతూరు మధు, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలూరు, న్యూస్‌టుడే: ఆలూరులోని అంబేడ్కర్‌ కూడలిలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిపోయిందని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, నెట్టెప్ప, భాస్కర్‌, నర్సప్ప కొమ్ము రామాంజి అన్నారు.

కోడుమూరు కోట్ల సర్కిల్‌లో బాణసంచా కాలుస్తున్న నాయకులు

కోడుమూరు, కోసిగి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో కోడుమూరు, కోసిగిలో తెదేపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. కోడుమూరు పట్టణ అధ్యక్షుడు ఎల్లప్ప నాయుడు ఆధ్వర్యంలో కోట్ల సర్కిల్‌లో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. కోసిగి మండల కేంద్రంలో తెదేపా జిల్లా రైతు సంఘం నాయకులు నాడిగేని అయ్యన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు.

ఎమ్మిగనూరు : ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఓటర్లు తెదేపాను గెలిపించి చరిత్ర సృష్టించారని తెదేపా నాయకుడు దయాసాగర్‌ అన్నారు. గురువారం పట్టణంలో 21వ వార్డులో ఇంటింటా తిరిగి ప్రజలకు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు ఉసేన్‌పీరా, వీరేశమ్మ, రేష్మ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని