logo

ఆహా ఏమి రుచి.. తినాలి మైమరిచి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు పలు పోటీలు జరుగుతున్నాయి.

Published : 25 Mar 2023 01:47 IST

మహిళలు తయారు చేసిన వంటలను పరిశీలిస్తున్న న్యాయ నిర్ణేతలు

కర్నూలు క్రీడలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు పలు పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు తుది అంకానికి చేరుకున్నాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, మానవత మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో శుక్రవారం మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. రాగి ముద్దలు, రాగి లడ్డూ, గారెలు, మిఠాయిలు తదితరాలను మహిళలు సిద్ధం చేసుకుని తీసుకొచ్చారు. తమ వంటల రుచులను అతిథులకు రుచి చూపించారు. విజేతలకు శనివారం బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సీఈవో రమణ, డీఎస్‌ఏ ప్రధాన శిక్షకుడు నటరాజరావు, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రమీలాదేవి, మానవత మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నే ప్రతాప్‌, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధం చేసిన పదార్థాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని