logo

అన్నదానం.. పుణ్య ఫలం

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని మసీదు కమిటీలు, పలువురు యువకులు బృందంగా ఏర్పడి ఉపవాసం (రోజా) ఉండే వ్యక్తులకు అన్నదానం (సహెరీ) ఏర్పాట్లు చేశారు.

Published : 25 Mar 2023 01:47 IST

నగరంలో సహెరీకి ఏర్పాట్లు

ఇఫ్తార్‌ విందులో ముస్లిం సోదరులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని మసీదు కమిటీలు, పలువురు యువకులు బృందంగా ఏర్పడి ఉపవాసం (రోజా) ఉండే వ్యక్తులకు అన్నదానం (సహెరీ) ఏర్పాట్లు చేశారు. నగరంలోని పలు మసీదుల వద్ద ప్రతిరోజూ తెల్లవారుజామున అన్నదానం చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు నగరంలోని ప్రతి మసీదులో ఇఫ్తార్‌ విందు సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సహెరీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చినవారు, ఉద్యోగాల కోసం వచ్చిన యువత సహెరీకి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు.

ఏర్పాటుచేసిన ప్రాంతాలివే..

* లాల్‌ మసీదు దారిలోని మజ్జిద్‌ ఎ ఖూబ్‌ సూరత్‌ బడే సాహెబ్‌, పెద్ద మార్కెట్‌ సమీపంలోని మజ్జిద్‌ ఎ నూరాని (జామియా మసీదు వెనుక), ఖడక్‌పుర వీధిలోని డాక్టర్‌ మియా హత్తి బీడీ ఫ్యాక్టరీ ప్రాంతం, మౌర్య ఇన్‌ సమీపంలోని హోటల్‌ ఇంటర్నేషనల్‌, కొత్తపేటలోని మజ్జిద్‌ ఎ హజరత్‌ మౌలా మిస్కిన్‌, కొత్తపేటలోని మజ్జిద్‌ ఎ ఖాదుమియా, సి.క్యాంపు సర్కిల్‌లో ఉన్న మజ్జిద్‌ ఎ మమూర్‌, అబ్బాస్‌ నగర్‌లోని మజ్జిద్‌ ఎ అబ్బాస్‌ (యునిక్‌ హై స్కూల్‌ వద్ద) వద్ద ఏర్పాటుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని