logo

రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయం

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 25 Mar 2023 01:47 IST

కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి

కోడుమూరు, న్యూస్‌టుడే: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడంతో కోడుమూరు పంచాయతీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ వేదవతి, గాలేరునగరితోపాటు, సుంకేసుల, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని, అక్రమ మద్యం ఇసుక, భూదందాకు పాల్పడు తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అక్రమ సంపాదనే ధ్యేయంగా వైకాపా నాయకులు దందాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చేస్తున్న ప్రచారం బూటకమన్నారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడితే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు భాగ్యరత్న, ఆంధ్రయ్య, కోట్ల కవితమ్మ, రాంబాబు, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, కెఈ.మల్లికార్జునగౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి, గోపాల్‌రెడ్డి, తిరుమలనాయుడు, ఎల్లప్పనాయుడు, రవీంద్రగౌడ్‌, లక్ష్మయ్య శెట్టి, తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ పరిపానలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పంచుమర్తి అనురాధ గెలుపుతో వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని మాజీ ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వరరెడ్డి అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్ద శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. కేక్‌కోసం మిఠాయిలు పంచుకున్నారు. బాణ సంచా కాల్చారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో మూడింట గెలిచి తెదేపా సత్తా చాటిందని, రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని అని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 108 నియోజక వర్గాలు, మూడు ప్రాంతాల్లో పట్టభద్రులు తెదేపాకు మద్దతిచ్చి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యానికి ఓటు వేశారన్నారు. కొత్త జీవోలు తీసుకువచ్చి కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుందరరాజు, రాముడు, దయాసాగర్‌, అయ్యళప్ప, బడేసాబ్‌, తురేగళ్ల నజీర్‌, తదితరులు పాల్గొన్నారు.

కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని