logo

మేధోశక్తిని పెంపొందించుకోవాలి

విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని డీఈవో అనురాధ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. 

Published : 25 Mar 2023 01:47 IST

విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్న డీఈవో అనురాధ

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే : విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని డీఈవో అనురాధ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.  జిల్లాలో 2 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపికచేసినట్లు వెల్లడించారు. విజేతలుగా గోస్పాడు ఏపీ ఎమ్మెస్‌ పాఠశాలకు చెందిన శ్వేత, గైడ్‌ టీచర్‌ అమీర్‌ సుహైల్‌, ఆళ్లగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్ష్మి, గైడ్‌టీచర్‌ చెన్నకేశ్వరిని ఎంపికచేసినట్లు వివరించారు.  జిల్లా సైన్స్‌ అధికారి సుందరరావు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని