logo

కమనీయం.. వీరభద్రస్వామి రథోత్సవం

జై వీరభద్ర.. నామస్మరణతో వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మూలవిరాట్టులకు ప్రత్యేక పూజలు చేశారు.

Published : 27 Mar 2023 03:07 IST

భక్తజన సందోహం నడుమ రథోత్సవం

కైరుప్పల(ఆస్పరి), న్యూస్‌టుడే: జై వీరభద్ర.. నామస్మరణతో వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మూలవిరాట్టులకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం రథోత్సవం వద్ద గ్రామపెద్దల ఆధ్వర్యంలో వేద పండితులు మల్లికార్జునస్వామి, మంజూనాథ్‌ హోమం నిర్వహించారు. వీరభద్రస్వామి, భద్రకాళీదేవి పార్వతి పరమేశ్వర ఉత్సవమూర్తులను పల్లకిలో తెచ్చారు. రథంపై అధిష్ఠింపజేసి లాగారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఆస్పరి, హోళగుంద ఎస్సైలు వరప్రసాద్‌,   విజయ్‌కుమార్‌ బందోబస్తు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని