logo

ఉపాధ్యాయులను అవమానించడం తగదు

పదో తరగతి పరీక్షలు జరుగుతున్నంతసేపు ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్‌లో ఉండాలంటూ వారిని అవమానించేలా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 27 Mar 2023 03:07 IST

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

నంద్యాల పాత పట్టణం, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్షలు జరుగుతున్నంతసేపు ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్‌లో ఉండాలంటూ వారిని అవమానించేలా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతేడాది పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం బయటకు రావడంలో ప్రధాన పాత్రధారి సీఆర్‌పీ అయినప్పటికీ ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులకు ఆపాదించారని ఆరోపించారు. వారిని సస్పెండ్‌ చేసి నెలలు తరబడి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఉపాధ్యాయులను పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టి అవమానించడం మానవ హక్కులను కాలరాసే చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ శివయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు ఎం.భాస్కర్‌రెడ్డి, సభ్యులు నాగేంద్రప్రసాద్‌, వీరేశ్వరరెడ్డి, మల్లికార్జునరావు, తిమ్మారెడ్డి, మహమ్మద్‌ హనీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని