logo

బంతి ఆట... పతకాల పంట

పేదింటి బిడ్డ కఠోర శ్రమ, పట్టుదలతో సాధన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా.. చదువుతోపాటు ఫుట్‌బాల్‌ ఆటపై కసరత్తు చేశారు. జాతీయస్థాయి ప్రదర్శనతో వివిధ పతకాలు సాధించి భేష్‌ అనిపిస్తున్నారు.

Published : 27 Mar 2023 03:07 IST

- న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

మెమెంటో అందుకుంటున్న సుభాన్‌

పేదింటి బిడ్డ కఠోర శ్రమ, పట్టుదలతో సాధన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా.. చదువుతోపాటు ఫుట్‌బాల్‌ ఆటపై కసరత్తు చేశారు. జాతీయస్థాయి ప్రదర్శనతో వివిధ పతకాలు సాధించి భేష్‌ అనిపిస్తున్నారు. సెలవు రోజుల్లో ఏదో పని చేసుకుంటూ క్రీడా సామగ్రి కొని సాధన చేస్తున్న ఆ యువకుడు జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్నారు.

ఎమ్మిగనూరులో నివాసముంటున్న హుసేనమ్మ, ఉరుకుందల కుమారుడు సుభాన్‌ సిదార్థ కళాశాలలో బీఏ చదివారు. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌ ఆట అంటే ఇష్టపడే ఆ యువకుడు మెలకువలు తెలుసుకుని సాధన చేశారు. ఫార్వార్డ్‌గా గోల్స్‌ సాధిస్తూ పతకాలు సాధిస్తున్నారు. 2023 ఫిబ్రవరి, 5, 6, 7, 8వ తేదీల్లో వైజాగ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని బేష్‌ అనిపించారు. క్లబ్‌ కేసీడీ, బ్లూస్టార్‌, సంతోష్‌ ట్రోఫీ పోటీల్లో రాణించి ఉత్తమ క్రీడాకారుడిగా పురస్కారం అందుకున్నారు. కర్నూలు జిల్లా జట్టు తరపున ఆడి రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి సంతోష్‌ ట్రోఫీ పోటీలకు ఎంపికయ్యారు. రాజస్థాన్‌, మిజోరం, కేరళ, బిహార్‌, జమ్ము కశ్మీర్‌ జట్లతో తలపడి క్వార్టర్స్‌కు చేరడంలో కీలకంగా వ్యవహరించారు.

విజయ ప్రస్థానం ఇదీ..

* 2010లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాజస్థాన్‌, మణిపూర్‌ జట్లపై రెండు గోల్స్‌ సాధించి జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు.

* 2012-13లో జమ్ము కశ్మీర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో యూపీ, మణిపూర్‌, కేరళ జట్లతో జరిగిన పోటీల్లో రాణించారు.

2014లో గుల్బర్గాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో గోల్‌ సాధించి చెన్నె, మధురై, బెంగళూరు జట్లతో జరిగిన పోటీలో కీలకంగా వ్యవహరించారు.

* 2017లో కోలకతాలో జరిగిన దక్షిణ భారత ఫుట్‌బాల్‌ పోటీల్లో హైదరాబాద్‌, శ్రీకాకుళం, నల్గొండ, చెన్నె అలగప్ప యూనివర్సిటీ జట్లతో జరిగిన పోటీల్లో రాణించి భళా అనిపించారు.

* 2018లో పాండిచ్చేరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కేరళ, చెన్నై జట్లతో జరిగిన పోటీల్లో గోల్స్‌ సాధించి విజయపథంలో నిలిపారు.

2019లో విజయనగరంలో జరిగిన సీఎం కప్‌ పోటీల్లో గీతం, ఆంధ్ర యూనివర్సిటీ జట్లతో తలపడి జట్టును ప్రథమ స్థానంలో నిలిపారు.

* 2021, 22లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని