logo

లక్ష్యం.. సుదూరమే

2022-23 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాకు రవాణా లక్ష్యం రూ.287 కోట్లకుపైగా విధించారు. ఇందులో ఇప్పటివరకు రూ.125 కోట్లకుపైగా అధికారులు లక్ష్యాన్ని చేరుకున్నారు.

Published : 27 Mar 2023 03:07 IST

త్వరలో ముగియనున్న  ఆర్థిక సంవత్సరం
చతికిలపడ్డ రవాణా శాఖ
- న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు

రవాణా శాఖ కార్యాలయం

2022-23 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాకు రవాణా లక్ష్యం రూ.287 కోట్లకుపైగా విధించారు. ఇందులో ఇప్పటివరకు రూ.125 కోట్లకుపైగా అధికారులు లక్ష్యాన్ని చేరుకున్నారు. మరో ఐదు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీనిని చేరుకోవాలంటే అయ్యే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాల పునర్విభజన ప్రభావం తీవ్రంగా చూపిందని జిల్లా రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నంద్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

భారీగా కేసులు నమోదు చేసినా..

కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు 5 వేల వరకు రాశారు. కొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. అధిక లోడుతో 3 వేలకుపైగా వాహనాలు వెళ్లినట్లు కేసులు రాశారు. ఆటోలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా నడిపిన వాహనాల కేసులు 6 వేల వరకు ఉన్నాయి. ఇన్ని కేసులు నమోదు చేసినప్పటికీ లక్ష్యం చేరుకోకపోవడం గమనార్హం. ఇసుక, తదితర ముడి సరకు తీసుకెళ్లే వాహనాలు (అధిక లోడు)కు సంబంధించి 5 వేలకుపైగా కేసులు రాశారు. వీటికి కోర్టు పరిధిలో జరిమానా విధించారు.

*  ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 22 మంది మోటారు వాహన తనిఖీ అధికారులు ఉన్నారు. ఒక్కో అధికారికి నెలకు రూ.13 లక్షల వరకు లక్ష్యం విధించారు. వీరు లక్ష్యాలు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్రైమాసిక పన్నులు, వాహన జీవిత కాలం పన్నులు, ఫీజులు, సర్వీసు ఛార్జీలు తదితరాలకు సంబంధించి లక్ష్యాలు చేరుకోలేదు.

*  ఈ విషయమై జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ 60 శాతం లక్ష్యాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని