logo

పాలకుల కారణంగానే సీమ వెనుకబాటు

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేటి ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్‌ వరకు అన్నివిధాలుగా నష్టపోయి, వెనుకబాటుతనానికి గురైంది రాయలసీమ వాసులేనని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 03:07 IST

మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేటి ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్‌ వరకు అన్నివిధాలుగా నష్టపోయి, వెనుకబాటుతనానికి గురైంది రాయలసీమ వాసులేనని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. సీమ అభివృద్ధికి ప్రజలు, పాలకులు, పాత్రికేయులు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దేవీ ఫంక్షన్‌హాల్‌లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.నాగరాజు అధ్యక్షతన ‘రాయలసీమ అభివృద్ధి- మీడియా పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. నాటి నుంచి నేటి వరకు అధికశాతం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని, అయినా ఈ కరవుసీమ అభివృద్ధి గురించి ఆలోచించిన దాఖలాల్లేవన్నారు. కృష్ణా బేసిన్‌కు సంబంధించిన నీటి వాటాల విషయంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. ఎగువభద్ర ప్రాజెక్టుతో సీమకు ఉరితాడు తప్పదని సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విభజనతో దారుణంగా నష్టపోయిన ప్రాంతం రాయలసీమ అని మాజీ ఎమ్మెల్యే గఫూర్‌, సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్‌ బొజ్జా దశరథ రామిరెడ్డి, మేయర్‌ బి.వై.రామయ్య, భాజపా నాయకులు కపిలేశ్వరయ్య మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని