logo

చిత్ర వార్తలు

కర్నూలు నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు సుంకేసుల జలాశయం నుంచి మంచినీటి పైపులైను ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

Updated : 27 Mar 2023 05:18 IST

ఖర్చు రూ.కోట్లు.. పనులకు తూట్లు

సాగుతున్న పైపులైను పనులు

కర్నూలు నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు సుంకేసుల జలాశయం నుంచి మంచినీటి పైపులైను ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రూ.82 కోట్లతో సాగుతున్న పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈ వేసవికి పైపుల ద్వారా నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు పైపులు దెబ్బతిన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. వాటిని అలాగే అమర్చితే ఇబ్బందులు తప్పవు.

దెబ్బతిన్న పైపు

ఈనాడు, కర్నూలు


ఇరుకు గదితో అవస్థలు

నందవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇలా ఒకే గదిలో కూర్చొని భోజనం చేస్తున్నారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 205 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి భోజనం చేసేందుకు తగిన వసతి లేదు. దీంతో ఇలా ఇరుకుగా కూర్చుని భోజనం చేస్తున్నారు. దాహార్తి తీరాలంటూ ఒకరిపై ఒకరిని దాటి వెళ్లాల్సి వస్తోంది. స్థలం చాలక కొందరు ఏకంగా ఎండలో కూర్చుని భోజనం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు పట్టణం


కల్వర్టు పనులు.. పైపై పూతలు

గుత్తి- పత్తికొండ ప్రధాన రహదారిలోని గిరిగెట్ల గ్రామ సమీపంలో కల్వర్టు దెబ్బతింది. దీని స్థానంలో ఐదు రోజులు కిందట రూ.8 లక్షలతో కొత్తది నిర్మించారు. నీరు పారేందుకు వీలుగా పైపులు వేసి కల్వర్టు నిర్మాణం చేపట్టారు. కల్వర్టు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలకు, ఇతర సిమెంట్‌ పనులకు క్యూరింగ్‌ నామమాత్రంగా చేస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు.  చేసిన నిర్మాణ పనులకు క్యూరింగ్‌ సరిగా చేయకపోవడంపై పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని   రహదారులు భవనాలు శాఖ డీఈ వెంకటేశ్వర్‌రెడ్డితో ప్రస్తావించగా.. కల్వర్టుకు గుత్తేదారు సక్రమంగా క్యూరింగ్‌ చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 న్యూస్‌టుడే, తుగ్గలి వెల్దుర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని