logo

ఎమ్మిగనూరు సెబ్‌ ఎస్సై సస్పెన్షన్‌

సెబ్‌ ఎమ్మిగనూరు మొబైల్‌ పార్టీకి చెందిన ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 30 Mar 2023 02:11 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సెబ్‌ ఎమ్మిగనూరు మొబైల్‌ పార్టీకి చెందిన ఎస్సై విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈనెల 20న కర్ణాటక రాష్ట్రం ఇటిక్యాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కర్ణాటక పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎస్సైకి చెందిన కారులో నాలుగు పెట్టెల మద్యం దొరికింది. కర్ణాటక రాష్ట్రం సిరిగుప్ప పోలీసులు కారుడ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం రవాణా వెనుక ఎస్సై పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావటంతో మొదట వీఆర్‌కు పంపారు. సెబ్‌ డీసీ శ్రీలత మళ్లీ విచారణ జరిపించి ఎస్సై విజయ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని