logo

ఆ ఉపాధ్యాయులు తహసీల్దారు కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలి

గతేడాది పదో తరగతి పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు ఈ ఏడాది పరీక్షల సమయంలో సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని పాఠశాల విద్య శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 30 Mar 2023 02:25 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : గతేడాది పదో తరగతి పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు ఈ ఏడాది పరీక్షల సమయంలో సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని పాఠశాల విద్య శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో గతేడాది ప్రశ్నపత్రం లీకైన ఘటనకు ఎనిమిది మంది ఉపాధ్యాయులను బాధ్యులను చేసి అప్పట్లో కేసులు నమోదు చేశారు. వారు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నంత సేపు తహసీల్దారు కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈనెల 28న స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు