logo

ప్రయాణ భారం

జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానుంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ రుసుము 5 నుంచి 10 శాతం పెంచనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రకటించారు.

Published : 31 Mar 2023 02:12 IST

- న్యూస్‌టుడే, చాగలమర్రి

చాగలమర్రి టోల్‌ప్లాజా

జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానుంది. ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ రుసుము 5 నుంచి 10 శాతం పెంచనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయి. ఎన్‌హెచ్‌-44 కర్నూలు జిల్లా కేంద్రం నుంచి డోన్‌ మీదుగా వెళ్తుంది. ఎన్‌హెచ్‌-40 కర్నూలు నుంచి కడప వరకు 198 కి.మీ వరకు ఉంటుంది. ఆయా రహదారులపై 4 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చాగలమర్రి టోల్‌ప్లాజా క్లైయింట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాంబాబు తెలిపారు. 

నిత్యం రూ.3,80,375 అధనం

కర్నూలు నుంచి కడప వైపు నిత్యం 3,500 వరకు కార్లు వెళ్తాయి. గతంలో రూ.80 తీసుకునేవారు. ఏప్రిల్‌ 1 నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నాలుగో చోట్ల కలిపి రూ.70 వేల అదనంగా భారం పడనుంది. లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌, లైట్‌ గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సులు కలిపి 1,200 వరకు వెళ్తాయి. ఆయా వాహనాలు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది... ఇలా ప్రతి వాహనదారికి అదనపు భారం పడనుంది. నాలుగు టోల్‌ ప్లాజాల పరిధిలో కలిపి వాహనదారులపై నిత్యం రూ.3,80,375 అదనంగా భారం పడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు