logo

వేటకొడవళ్లతో దాడి

ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తిపై వేటకొడవళ్లతో దాడి చేశారు. మాధవరం ఎస్సై కిరణ్‌, గ్రామస్థుల కథనం ప్రకారం.. రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఈడిగ బోడెయ్యకు పెద్ద ఈరప్ప, చిన్న ఈరప్ప, నరసింహులు ముగ్గురు కుమారులు.

Updated : 31 Mar 2023 06:23 IST

మంత్రాలయం, న్యూస్‌టుడే: ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తిపై వేటకొడవళ్లతో దాడి చేశారు. మాధవరం ఎస్సై కిరణ్‌, గ్రామస్థుల కథనం ప్రకారం.. రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఈడిగ బోడెయ్యకు పెద్ద ఈరప్ప, చిన్న ఈరప్ప, నరసింహులు ముగ్గురు కుమారులు. ఆస్తి తగాదాల విషయంలో ఎనిమిది సంవత్సరాలుగా పంచాయితీ జరుగుతోంది. గురువారం తగాదా ఉన్న పొలంలో పెద్ద ఈరప్ప రాళ్లు పాతడంతో ఎందుకు పాతావని చిన్న ఈరప్ప అడిగాడు. దీంతో వారి మధ్య మాటమాట పెరిగింది. అనంతరం ఇంటి వద్ద గొడవ జరిగింది. ఠాణాలో ఫిర్యాదు చేస్తానని చిన్న ఈరప్ప అనటంతో పెద్ద ఈరప్ప కుమారులు భీమ, రాముడు అతనిపై వేటకొడవళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్సై కిరణ్‌ అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డవారిని 108 వాహనంలో ఎమ్మిగనూరు వైద్యశాలకు తరలించామని, వైద్యశాలలో ఇరువర్గాలను విచారించి కేసు నమోదు దర్యాప్తు చేస్తామని ఎస్సై కిరణ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని