logo

చిత్ర వార్తలు

కర్నూలు జిల్లా కేంద్రంలోని సర్వజన వైద్యశాలలోని పీడియాట్రిక్‌ విభాగానికి కొవిడ్‌ సమయంలో అత్యవసర వైద్యం కోసం సుమారు 24 వెంటిలేటర్లు అందించారు.

Published : 31 Mar 2023 02:12 IST

ఊపిరి తీశారు

కర్నూలు జిల్లా కేంద్రంలోని సర్వజన వైద్యశాలలోని పీడియాట్రిక్‌ విభాగానికి కొవిడ్‌ సమయంలో అత్యవసర వైద్యం కోసం సుమారు 24 వెంటిలేటర్లు అందించారు. ఒక్కో పరికరం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువ ఉంటాయి. కొవిడ్‌ అనంతరం అవన్నీ నిరుపయోగంగా మారడంతో మూలన పెట్టేశారు. వాటిని వాడాలని వైద్యులు ప్రయత్నించినా పరికరాలకు సంబంధించిన ప్లగ్‌లు, పిన్‌లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో విలువైన పరికాలు దుమ్ము పట్టి పనికిరాకుండా పోతున్నాయి.

న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం


బాటసారులకు ఇబ్బందులు

ఆళ్లగడ్డ మండలంలోని 40వ జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్లపై పంట దిగుబడులు ఆరబోస్తున్నారు. పేరాయపల్లె, నల్లగట్ల గ్రామాల వద్ద సర్వీస్‌ రోడ్లపై మొక్కజొన్న, ఎండు మిరపను దారి పొడవునా ఆరబోశారు. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ఆయా గ్రామాలకు వెళ్లేవారు దిగుబడులు కనిపించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రైతులు దిగుబడులను రోడ్లపై కాకుండా పొలాల్లో, కళ్లాల్లో ఆరబోసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం


మండే ఎండలో నీటి బండి

వేసవి ఎండలు మండిపోతుండడంతో గ్రామాల్లో చిన్నారులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. మద్దికెరలో గురువారం తోపుడు బండ్లలో నీటి బిందెలు, క్యాన్లతో చిన్నారులు ఇలా కష్టపడుతూ కనిపించారు. పెద్ద వాళ్లకు బదులుగా బాలబాలికలే నీటి కోసం ఇలా ఇబ్బందులకు గురవుతున్నారు.  

న్యూస్‌టుడే, మద్దికెర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని